ETV Bharat / state

'ఎంపీ నిధులతో క్రయోజెనిక్ ట్యాంకు ఏర్పాటుకు చర్యలు' - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురం జిల్లాలో మెుదటి క్రయోజెనిక్ ట్యాంకు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఎంపీ నిధుల నుంచి రూ. 20 లక్షలు ఖర్చు చేయడానికి పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు.

'ఎంపీ నిధులతో క్రయోజెనిక్ ట్యాంకు ఏర్పాటుకు చర్యలు'

author img

By

Published : May 25, 2021, 7:50 PM IST

అనంతపురం జిల్లాలో మొదటి క్రయోజెనిక్ ట్యాంక్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. దీనికి ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షల ఖర్చు చేయడానికి పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు. గతంలో క్రయోజెనిక్ ట్యాంకు లేనందు వల్ల ఆక్సిజన్ నిల్వ ఉంచడానికి ఇబ్బందిగా ఉండేదని.. క్రయోజెనిక్ ట్యాంకు వల్ల ఆక్సిజన్ నిల్వ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో సర్వజన ఆసుపత్రిలో క్రయోజెనిక్ ట్యాంకు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

తెల్లవారితే పెళ్లి- ప్రేయసితో వరుడు పరార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.