ETV Bharat / state

'మేం ఇక్కడ ఉన్నాం.. మమ్మల్ని రాష్ట్రానికి తీసుకెళ్లండి'

'మా పరిస్థితి.. చానా ఘోరంగా ఉంది ఇక్కడ. కనీసం కట్టుకోడానికి బట్టలేదు. తిందామంటే అన్నం లేదు. పిల్లలను చూసి బతుకుతున్నాం.. లేకుంటే ఎప్పుడో.. చచ్చేవాళ్లం'.. మా అమ్మను ఒక్కసారి చూడాలని ఉంది.. ఈ మాటలన్నీ ఒకరివే కాదు... చాలామంది మనోవేదన అదంతా. పొట్టకూటి కోసం ముంబయి చేరిన రాష్ట్రవాసులకు...కష్టం కరోనా రూపంలో వచ్చింది. లాక్​డౌన్​లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.

మేం ఇక్కడ  ఉన్నాం.. మమ్మల్ని ఏపీ తీసుకెళ్లండి

author img

By

Published : Apr 16, 2020, 8:14 PM IST

మేం ఇక్కడ ఉన్నాం.. మమ్మల్ని ఏపీ తీసుకెళ్లండి

వారంతా పొట్టకూటి కోసం ముంబయి వెళ్లారు. ఇప్పుడు లాక్​డౌన్​లో చిక్కుకుని.. సొంతగూటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. కడుపున పుట్టిన పిల్లలను బతికించుకోవాలని ఆరాట పడుతున్నారు. తినేందుకు తిండిలేక... చిన్నపిల్లలను పస్తులు ఉంచలేక నరకం అనుభవిస్తున్నారు. జగనన్న దయ తలచాలని వేడుకుంటున్నారు.

రాష్ట్రానికి చెందిన చాలామంది.. పొట్టకూటి కోసం ముంబయి వెళ్లారు. నగరంలోని వాడీ బందర్ ఏరియాలో నివాసముంటున్నారు. చాలా ఏళ్లుగా అక్కడే పని చేస్తూ.. చాలీచాలని డబ్బుతో వచ్చిన దాంతో బతుకుతున్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు నానా అవస్థలు పడుతున్నారు. ఓ వైపు ఉపాధి లేక.. మరోవైపు ఇంట్లో తిండి గింజలు... కరవై నరకం చూస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారని.. ఎలాగైనా ఏపీకి తీసుకెళ్లండంటూ.. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. లాక్​డౌన్ పూర్తయ్యాక మళ్లీ పెంచారని.. డబ్బులు లేకుండా ఎన్ని రోజులు ఉంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబయి వాడీ బందర్ పరిసర ప్రాంతంలో మెుత్తం 1000 నుంచి 1500 మంది వరకూ తెలుగువాళ్లు ఉన్నట్లు.. అనంతపురం వ్యక్తి తెలిపాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని.. తమను తీసుకెళ్లాలంటూ కంటనీరు పెట్టుకున్నాడు.

ఇదీ చదవండి: కరోనాపై 'అమ్మ, నాన్న, ఓ ఏడేళ్ల అమ్మాయి' పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.