పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలల్లో పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. పెనుగొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ పరిశ్రమ, కియా శిక్షణ కేంద్రాన్ని రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఏపీఎస్డీసీ ఎండి ఆర్జా శ్రీకాంత్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. శిక్షణ అందించే విధానాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులకు కియా పరిశ్రమ ప్రతినిధులు వివరించారు.
వివిధ పరిశ్రమల్లో అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలల్లో పాఠ్య ప్రణాళిక రూపొందించేందుకు కియా పరిశ్రమకు వచ్చినట్లు వెల్లడించారు. కియాలో కార్ల తయారీకి సంబంధించి నెల, 3 నెలల కోర్సులను రూపొందించేందుకు అవకాశాలను పరిశీలించామన్నారు.
ఇదీ చదవండి