అప్పుల బాధ, అనారోగ్యం కారణంగా ఓ అన్నదాత తనువు చాలించాడు. చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తలుపుల మండలం గుడాలగొంది గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గుడాలగొంది గ్రామానికి చెందిన ప్రసాద్‌రెడ్డి... వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించే వారు. పెట్టుబడి కోసం అప్పులు చేశాడు.
వరుసగా పంటలు చేతికి అందకపోవడం కారణంగా... చేసిన అప్పులు వడ్డీతో కలిపి భారంగా మారాయి. మరోవైపు అనారోగ్యం ప్రసాద్‌రెడ్డిని కుంగదీసింది. ఏం చేయాలో పాలుపోక మామిడి తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రసాద్ రెడ్డి చేసిన అప్పులు సుమారు 10లక్షల వరకు ఉన్నట్లు ఆయన బంధువులు తెలిపారు.
ఇదీ చదవండీ... గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి