ETV Bharat / state

ANIMAL LOVER: 22 ఏళ్లుగా.. మూగజీవాల ఆకలి తీరుస్తున్న జంతుప్రేమికుడు - మూగజీవాల ఆకలి తీరుస్తున్న జంతుప్రేమికుడు

బయటి నుంచి అమ్మ ఇంటికి రాగానే పిల్లలు ఆమె చుట్టూ చేరినట్టు.. అతను ఒక్క ఈల వేస్తే చాలు మూగజీవాలు ఒక్క చోటుకు చేరతాయి. రెండు దశాబ్దాలుగా ప్రతిరోజూ వాటి ఆకలి తీరుస్తూ.. ఈ రోజు ఓ స్థాయికి చేరుకున్నానంటే వాటికి చేసిన సేవ వల్లేనని అతను నమ్ముతున్నారు. మూగజీవాలే కాక సాయం కోరి తన వద్దకు వచ్చిన ఎవరికైనా తోచింది చేస్తుంటారు.

ANIMAL LOVER ARJUN SINGH FEEDING
మూగజీవాల ఆకలి తీరుస్తున్న జంతుప్రేమికుడు అర్జున్‌ సింగ్
author img

By

Published : Jun 27, 2021, 7:14 PM IST

మూగజీవాల ఆకలి తీరుస్తున్న జంతుప్రేమికుడు అర్జున్‌ సింగ్

అతను వేసే ఈల మూగజీవాల ఆకలి తీరుస్తుంది.. 22 ఏళ్లుగా పశుపక్ష్యాదుల ఆకలి తీరుస్తున్న ఇతని పేరు అర్జున్‌ సింగ్. 30 ఏళ్ల క్రితం అనంతపురంలో స్థిరపడ్డారు. మెటల్ వర్క్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా తాను ఇబ్బంది పడుతున్న రోజుల నుంచే.. ఉన్నదాంట్లో కొంత మూగజీవుల ఆకలి తీర్చేందుకు వెచ్చించేవారు. తన సంపాదన పెరిగే కొద్దీ వాటికి పెట్టే ఖర్చునూ పెంచుతూ వస్తున్నారు.

రోజూ ఉదయాన్నే మార్కెట్‌కు వెళ్లి క్రేట్ అరటిపళ్లు సహా సీజనల్‌గా లభించే వివిధ ఫలాలు కొనుగోలు చేసి.. ఇంట్లో భార్య తయారు చేసే ఆహారం పట్టుకుని 12 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. దారిపొడవునా మూగజీవుల ఆకలి తీర్చడమే కాక.. పేదలు, పిల్లలు, వృద్ధులు ఇలా ఎవరు అడిగినా దానం చేస్తుంటారు. ఆలయాల అనుబంధ గోశాలల్లో గోవులకు పశుగ్రాసం అందిస్తారు. అపారమైన దైవభక్తి ఉన్న అర్జున్‌సింగ్.. ఆలయాల్లో నైవేద్యానికి ఫలాలు సమర్పిస్తారు. బుక్కరాయసముద్రంలో పురాతన ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో రూ. 2.5 లక్షలతో షెడ్డు నిర్మించారు.

ఇవీ చదవండి:

డ్రోన్లతో ఉగ్రదాడులు- జమ్ములో ఏం జరుగుతోంది?

అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.