తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థిని సత్తా చాటింది. ఉరవకొండ మండలం వ్యాసపురానికి చెందిన ఆశ్రిత... 991 మార్కులతో ద్వితీయస్థానం కైవసం చేసుకుంది. రైతు గోవిందప్ప, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న జయలక్ష్మి కుమార్తె అయిన ఆశ్రిత.. ఐఏఎస్ అయి పేదల కష్టాలు తీర్చటమే లక్ష్యమని తెలిపింది. రైతుగా తన తండ్రి పడుతున్న కష్టాలు తెలుసని, వారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది.
ఇదీ చదవండి: 'ఒకరితో మొదలయ్యాం.. 11 మంది అవుతాం'