ETV Bharat / state

త్వరలో అనంతలో 14 వైఎస్సార్ అగ్రీ ల్యాబ్​లు - విత్తనాల నాణ్యత

కల్తీ పురుగు మందులు, నకిలీ విత్తనాలతో అన్నదాతలు నష్టపోకుండా వాటి నాణ్యతను పరిశీలించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ అగ్రి ల్యాబ్​లు ఏర్పాటు చేయనుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించే వీటి కోసం అనంతపురం జిల్లాలోని అనువైన ప్రదేశాలను వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయలక్ష్మి పరిశీలించారు.

అనంతలో 14 వైఎస్సార్ అగ్రి ల్యాబ్​లు : వ్యవసాయశాఖ అధికారి విజయలక్ష్మి
author img

By

Published : Jul 21, 2019, 5:53 AM IST

అనంతలో 14 వైఎస్సార్ అగ్రి ల్యాబ్​లు : వ్యవసాయశాఖ అధికారి విజయలక్ష్మి

అనంతపురం జిల్లా ఉరవకొండలో వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయలక్ష్మి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న వైఎస్సార్ అగ్రీ ల్యాబ్​ల కోసం అనువైన స్థలం, గోదాములను పరిశీలించారు. ప్రయోగశాలకు కావలసిన సదుపాయాలపై స్థానిక వ్యవసాయ అధికారులతో చర్చించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 14 అగ్రి ల్యాబ్​లను మంజూరయ్యాయని విజయలక్ష్మి తెలిపారు. ఎరువులు, విత్తనాలు వాటి నాణ్యతను ఈ ప్రయోగశాలలలో పరిశీలిస్తారని పేర్కొన్నారు. కల్తీ పురుగుల మందులు, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకే వీటిని అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది ఈ ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయన్నారు. ఇప్పటికే జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో స్థలం, గోదాములను పరిశీలించామని వెల్లడించారు.

ఇదీ చదవండి : 100 కిలోల నకిలీ విత్తనాలు పట్టివేత

Intro:టెస్ట్ ఫైల్

Body:విశాఖపట్నం

Conclusion:గాజువాక
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.