ETV Bharat / state

పోలీసునూ వదలని కోవిడ్... వైరస్ సోకి సీఐ మృతి - అనంతపురంలో కరోనా కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. వాళ్లూ వీళ్లూ అన్న తేడా లేకుండా అందరికీ మచ్చెమటలు పట్టిస్తోంది. అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందిపైనా పంజా విసురుతోంది. తాజాగా ఈ మహమ్మారి కోరలకు చిక్కిన అనంతపురం ట్రాఫిక్ సీఐ మృత్యువాత పడ్డారు.

Ananthapuram traffic CI Death With corona
ఎవరినీ వదలని మహమ్మారి.. కరోనాతో అనంతపురం సీఐ మృతి
author img

By

Published : Jul 14, 2020, 7:34 PM IST

అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్.. కరోనా లక్షణాలతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించగా.. కర్నూలుకు తరలిస్తుండగానే ప్రాణం విడిచారని పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్​గా తేలింది. రాజశేఖర్​కు నెగటివ్ వచ్చింది. కానీ... వారం రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నందున మళ్లీ పరీక్షలు చేయించుకోగా.. వైరస్ ఉన్నట్లు తేలింది. చివరికి విషమ పరిస్థితుల్లో ఆయన కోవిడ్ కు బలయ్యారు.

ఇదీ చదవండి:

ఆ నలుగురికి.. అమరావతి రైతుల లేఖలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.