మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనంతపురం జిల్లా తెదేపా నేతలు అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో ఈ నిర్ణయంపై ముందుకెళ్లాలని కల్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు సూచించారు. మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ దొడగట్ట నారాయణ మాట్లాడుతూ.. సీఎం జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానులంటున్నారని విమర్శించారు. ఆ ఉద్దేశం లేకపోతే చంద్రబాబునాయుడు విసిరిన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..