ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలో రాజధాని పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కార్యాచరణ వెల్లడించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో... ఈనెల 5వ తేదీన జిల్లాలోని నియోజకవర్గాలలో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. 6, 7 తేదీల్లో రాష్ట్ర అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపడుతున్నట్లు వివరించారు. 11వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధం అవుతున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి..