ETV Bharat / state

కలవరమాయె'మడి'లో!

author img

By

Published : May 1, 2020, 9:58 AM IST

అనంతపురం జిల్లాలో పండించిన పంటను అమ్ముకోలేక రైతన్న అవస్థలు పడుతున్నారు. ఉత్పత్తులు పోలం దాటే దారి లేక కన్నీరు పెడుతున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని ..మరిన్ని కేంద్రాలు అవశ్యం ఉందని అధికారులను కోరుతున్నారు.

ananthapuram farmes dificulties
అనంతపురంలో రైతుల కష్టాలు

వరుణుడు కరుణించాడు. ఎగువన తుంగభద్రమ్మ.. పొరుగున కృష్ణమ్మ ఆశీర్వదించారు. సుజలాలు పుష్కలంగా దరి చేరాయి. అన్ని పంటలు బాగా పండాయి. ఇక కష్టాల నుంచి గట్టెక్కామని కర్షకులు మురిసినంతసేపు పట్టలేదు. ఒక్క ఉదుటున కరోనా కత్తి దూసింది. రైతు ఆశలు తుత్తునియలు చేసింది. ఫలం కళ్లెదుటే ఉన్నా.. ప్రతిఫలం దక్కని దయనీయమిది. కొన్ని ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటైనా కొనుగోళ్లు ఊపందుకోలేదు. మరికొన్నింటికి ఆ ఊసే లేదు. అధికారులు స్పందించి చొరవ తీసుకుంటేనే రైతు మోము వెలిగేది.

రైతన్నా.. నీకోసం

ఉద్యాన రైతులు.. ఉత్పత్తుల రవాణాకు అనుమతులు.. విపణికి తరలింపులో ఇబ్బందులు ఎదురైతే 08554-275805కు ఫోన్‌ చేస్తే వారి కష్టాలు చక్కదిద్దుతామని జేడీఏ హబీబ్‌బాషా తెలిపారు.

కౌలు చెల్లించేదెలా?

నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. ఎకరాకు 40 బస్తాలు చేతికొచ్చింది. మద్దతు ధర కన్నా రూ.300 తక్కువకు వ్యాపారులు అడుగుతున్నారు. ఆ ధరకు అమ్మితే కౌలుపోగా పెట్టుబడి కూడా రాదు. ఆ ధరకు అమ్ముకోలేక ధాన్యాన్ని దారిపై ఆరబెడుతూ రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నా. - ఎర్రిస్వామి, కణేకల్లు

కొనుగోళ్లు వేగవంతం చేస్తాం

మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరలోనే పెట్టి ఎంపిక చేసిన రకాలను కొంటాం. ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు స్థానికంగా అనుమతులు ఇప్పిస్తున్నాం. తరలింపునకు సహకరించాలని పోలీసు శాఖకు సూచించాం. - గంధం చంద్రుడు, కలెక్టర్‌

వరికోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. ఖరీఫ్‌లోనూ కేంద్రాలు పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. అడపాదడపా ఈదురు గాలులు, వర్షాలకు ధాన్యం తడుస్తోంది. ఈ కష్టకాలంలోనైనా కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు పంట కొనాలి.

వేసవి, కరోనా ధాటికి ఫౌల్ట్రీ డీలాపడి మొక్కజొన్న రైతులు తల్లడిల్లుతున్నారు. 35 కొనుగోలు కేంద్రాల్లో 1,672 మెట్రిక్‌ టన్నులే కొన్నారు. ఇంకా 27 వేల మెట్రిక్‌టన్నులు కొనాలి. మరిన్ని కేంద్రాలు పెట్టి గ్రామస్థాయిలో కొనుగోళ్లు చేపడితే రైతులకు మంచిది.

మన ఉల్లి.. కర్నూలు, చెన్నై మార్కెట్లకు వెళ్లేది. విపణిలో కిలో రూ.30-35 పలుకుతోంది. అధికారులు అనంత నగరంలో హోల్‌సేల్‌ వ్యాపారులతో మాట్లాడి కొన్పించాలి. వ్యాపారులు సమ్మతిస్తే తామే పంటను తెస్తామని కర్షకులు చెబుతున్నారు.

మన దానిమ్మ.. చెన్నై, బెంగళూరు, కేరళకు వెళ్లేది. ప్రస్తుతం ఆ అవకాశం లేక పంటను చెట్ల మీదే వదిలేయడంతో మాగి.. రాలిపోతున్నాయి. కొనుగోలు, రవాణాకు వ్యాపారులకు వీలు కల్పిస్తే మేలిమి రకం దానిమ్మకు మంచి ధర లభించే వీలుంది.

లాక్‌డౌన్‌ ముందు మిర్చికి మంచి ధరే ఉంది. ఇటీవల ధర పడటంతో ఉత్పత్తులను కర్ణాటకలో శీతల గోదాముల్లో ఉంచారు. క్వింటాకు రూ.వెయ్యి వరకూ అదనపు భారం పడుతోంది. అటు ధర లేక.. ఇటు భారం భరించలేక తల్లడిల్లుతున్నారు.

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.