అనంత వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొన్నిరోజులుగా బత్తాయి అమ్మకానికి వీలు కల్పించారు. నాలుగైదు రోజుల నుంచి కాయలు కొద్దిగానే వస్తున్నాయి. బుధవారం 200 టన్నులు రాగా.. రాత్రి భారీ వర్షం కురిసి కాయల రాశుల మధ్య నీరు చేరింది. వేలం ఆలస్యంగా మొదలైనా టన్ను రూ.6,500-రూ.10,500 పలికింది. అయితే... వాన నీటిలో ఉత్పత్తులున్నాయి. కాయలు కుళ్లి 10-15 శాతం నష్టం జరిగే వీలుంది. ధర తగ్గించుకోవాల్సిందే. తరుగు ఇవ్వాల్సిందే. లేకపోతే కొనమని వ్యాపారులు చెప్పారు. చేసేదేమీ లేక అయిన కాడికి రైతులు కాయలు అమ్ముకున్నారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి.
ఇదీ చదవండి...ఆర్డినెన్స్‌పై వ్యాజ్యాల్లో.. నేరుగా విచారణ