ఇదీచదవండి.
ఇసుక సరఫరా చేయాలని అనంతపురంలో ఆందోళన - house construction stop in ananthapuram
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో రెండు నెలలుగా తమ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొలనూరు లబ్దిదారులు నిరసన తెలియజేశారు. ఉన్నతాశయంతో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ తమకు ఇళ్ల నిర్మాణానికి సహాయం అందిస్తే.. ప్రభుత్వం ఇసుక సరఫరా చేయకుండా తమను మనోవేదనకు గురి చేస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఇసుక అందుబాటులో ఉన్నా.. అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇసుక సరఫరా చేయాలని అనంతపురంలో ఆందోళన
ఇదీచదవండి.
రైలు కింద పడి ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
TAGGED:
govt sand policy