అనంతపురం జిల్లా హిందూపురం డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి వి.రాజేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి నోడల్ అధికారిగా.. కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమయ్యారని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కర్ణాటకలో సంపూర్ణ లాక్డౌన్: యడియూరప్ప
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం చూపిన కారణంగా నిబంధనల ప్రకారం సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులో తెలిపారు. హిందూపురం ఆసుపత్రికి నూతన నోడల్ అధికారిగా.. పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతిని నియమించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: