అనంతపురంలో సంచలనం సృష్టించిన మహమ్మద్ రఫీ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రఫీ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానిక రామ్‌నగర్‌లో నివాసముంటూ ఫోటోగ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే క్రమంలో నందమూరినగర్‌కు చెందిన గోపి భార్యతో రఫీకి పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే విషయం గోపికి తెలిసింది. ఫలితంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఉందనే అనుమానంంతో రఫీ హత్యకు గోపి కుట్ర పన్నాడు.
ఆదివారం ఉదయం కత్తితో రఫీ గొంతు కోసి గాయపర్చగా అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. నిందితుడు గోపిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని...హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు.
ఇదీ చూడండి: