ETV Bharat / state

అండగానిలుస్తూ ..అమ్మకు ప్రాణం పోస్తూ - Anantapur Government General Hospital latest news

అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రసూతి విభాగం గర్భిణులకు అండగా నిలిచింది. కరోనా పాజిటివ్‌ ఉందని తెలిసినా అక్కున చేర్చుకుంటోంది. పేద, మధ్య తరగతి గర్భిణులే కాదు.. ధనికులు సైతం ఈ ఆస్పత్రికే వస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా సోకిన గర్భిణులను చేర్చుకోవడం లేదు. ఏదొక సాకుతో పెద్దాస్పత్రికే సిఫార్సు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అందరినీ చేర్చుకుని, వైద్యసేవలు అందిస్తున్నారు.

Anantapur Government General Hospital
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
author img

By

Published : May 25, 2021, 12:52 PM IST

అనంతపురంప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గర్భిణిలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. విషమ పరిస్థితిలో వస్తున్నా వైద్య చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సాధారణ గర్భిణుల తరహాలోనే సుఖ ప్రసవం లేదా సిజేరియన్‌ చేసి పండంటి బిడ్డలను, మాతృమూర్తులను క్షేమంగా ఇంటికి పంపిస్తున్నారు. సర్వజనాసుపత్రి మొత్తాన్ని కొవిడ్‌ కేంద్రంగా చేసినా... స్త్రీవ్యాధుల వైద్య విభాగాన్ని అలానే ఉంచారు.

తాడిపత్రికి చెందిన 23 ఏళ్ల నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. నెలలు నిండాయి. స్వల్ప జ్వరం, దగ్గు.. వంటి లక్షణాలు ఉన్నాయి. అప్పటికప్పుడు రాపిడ్‌ విధానంలో కరోనా పరీక్ష చేశారు. పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. అయినా వైద్యులు వెనకడుగు వేయలేదు. పురిటినొప్పులు ప్రారంభం కావడంతో వ్యక్తిగత రక్షణ కవచం(పీపీఈ) ధరించి సిజేరియన్‌ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 14 రోజుల తర్వాత ఆమె డిశ్ఛార్జి అయింది. ఇంటికి వెళ్తూ వైద్యులు, సిబ్బందికి మొక్కారు.

కదిరికి చెందిన 28 ఏళ్ల మహిళ ఎనిమిది నెలల గర్భిణి. కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో కదిరిలో స్వాబ్‌ పరీక్ష చేయించారు. పాజిటివ్‌ ఉండటంతో అనంత నగరంలో ఏ ప్రైవేట్‌ ఆస్పత్రిలోనూ చేర్చుకోలేదు. చివరకు సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రత్యేక ఐసోలేషన్‌లో చేర్పించారు. తొలుత కరోనాకు ప్రత్యేక వైద్య చికిత్స చేశారు. 14 రోజుల తర్వాత నయం కావడం.. ఈలోపు నొప్పులు రావడంతో సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్లారు.

ఏప్రిల్‌ నుంచే శ్రీకారం

జిల్లా వ్యాప్తంగా గర్భిణులు ఎక్కువగా సర్వజనాస్పత్రికే వస్తున్నారు. కాలక్రమేణ పాజిటివ్‌ గర్భిణుల సంఖ్య పెరగడంతో ప్రత్యేక ఐసోలేషన్‌ విభాగాన్ని నెలకొల్పారు. ఏప్రిల్‌లో 59 మంది రాగా.. ఏడుగురు సాధారణ ప్రసవం పొందారు. 22 మందికి సిజేరియన్‌ చేశారు. మే నెలలో ఇప్పటిదాకా 185 మంది చేరారు. వీరిలో 29 మంది సాధారణ ప్రసవం పొందారు. 40 మందికి సిజేరియన్‌ చేశారు. మిగతా వారందరూ వైద్య చికిత్స పొందుతున్నారు. కొందరికి ప్రసవం తర్వాత కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్నారు.

పీపీఈ కిట్లతో భద్రత

కొవిడ్‌ ఐసోలేషన్‌ విభాగంలో వైద్య సిబ్బంది తగిన రక్షణ కవచాలను ధరిస్తున్నారు. కొవిడ్‌ గర్భిణులకు ప్రసవం చేసే సమయంలో విధిగా పీపీఈ కిట్లను ధరిస్తున్నారు. అయినా పలువురు వైద్యులు, పీజీ వైద్యులు, కింద స్థాయి సిబ్బందికి కరోనా సోకింది. 14 రోజులు వైద్య చికిత్స పొందిన తర్వాత మళ్లీ విధుల్లో చేరుతున్నారు.

60 పడకలతో ఐసోలేషన్‌

కొవిడ్‌ బారిన పడిన గర్భిణులు, బాలింతల కోసమే 60 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్‌ విభాగాన్ని నెలకొల్పాం. పీపీఈ కిట్లతో వైద్య చికిత్స అందిస్తున్నాం. ఐదు, ఆరు, ఏడు నెలల గర్భిణులకు పాజిటివ్‌ వస్తే.. ఇళ్లలోనే ఉండాలని కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. వీరిపై నిఘా ఉంచేందుకు సంబంధిత ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు సమాచారం పంపిస్తున్నాం. ఒకవేళ ఇక్కడే ఉండాలనుకుంటే ఉంచుతున్నాం. మధుమేహం, రక్తపోటు, ఉమ్మనీరు వెళ్లడం.. వంటి సమస్యలతో విషమ పరిస్థితిలో వచ్చినా వైద్య అందిస్తున్నాం. రెండో దశలో ఎక్కువ మంది గర్భిణులపై కొవిడ్‌ ప్రభావం ఉంది. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. - ఆచార్య షంషాద్‌బేగం, హెచ్‌ఓడీ, స్త్రీవ్యాధుల వైద్య విభాగం

ప్రతి ఒక్కరికీ పరీక్ష చేస్తున్నాం

గర్భిణులపై కరోనా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. అందుకోసమే ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ నెలలను బట్టి స్వాబ్‌, రాపిడ్‌ విధానంలో వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నాం. అవసరమైన వారికి రెమ్‌డెసివిర్‌ సూది మందులు, ఇతర వైద్య చికిత్స అందిస్తున్నాం. కొవిడ్‌ బాధితులకు తలెత్తే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాం. అందరిలో ధైర్యం నింపుతున్నాం. రోజూ నాలుగు నుంచి ఆరుగురు గర్భిణులకు ప్రసవం చేస్తున్నాం. ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం, అబార్షన్‌, రక్తస్రావం, కడుపులోనే బిడ్డ చనిపోవడం.. వంటి సమస్యలతో వచ్చే గర్భిణులకు వైద్య చికిత్స అందించడం కష్టంగా ఉంటోంది. - ఆచార్య సంధ్య, స్త్రీవ్యాధుల వైద్య విభాగం

ఇదీ చదవండీ… ఆదోని సబ్​ జైలుకు బీసీ జనార్దన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.