అనంతపురం జిల్లా కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.
కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురం ప్రాంతంలో ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో వందలాది లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి పలువురిపై కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీ, అక్రమంగా ఇసుక తరలింపు చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి