ఇండోర్ స్టేడియం పనులు ఎప్పటికి పూర్తయ్యేనో..! - latest news of anantapur dst indoor stadium
అనంతపురం జిల్లా మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 2018 ఏడాదిలో నిర్మించ తలపెట్టిన ఇండోర్ స్టేడియం పనులు ఇప్పటివరకు పూర్తికాలేదు. 90 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులు పూర్తి కాలేదు. ఫలితంగా క్రీడాకారులకు నిరాశే ఎదురవుతోంది. ప్రజాధనం వృథా అవుతోంది. ప్రస్తుతం ఈ స్టేడియం అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మిగిలిన పనులు పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.
మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుర్తయిన ఇండోర్ స్టేడియం