ETV Bharat / state

JC prabhakar on CI death: తాడిపత్రి సీఐ ఆనందరావుది ముమ్మాటికీ రాజకీయ హత్యే: జేసీ ప్రభాకర్​రెడ్డి - Tadipatri Town CI Ananda Rao Suicide Updates

Tadipatri Town CI Ananda Rao Suicide Updates: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి కారణంగానే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని, సీఐ ఆనందరావుది మూమ్మటికీ రాజకీయ హత్యేనని జేసీ ప్రభాకర్​రెడ్డి ఆరోపించారు. ఆనందరావు ఫోన్‌లోని కాల్‌డేటాను డిలీట్‌ చేశారని.. పలు వీడియో క్లిప్పుంగులను ప్రభాకర్​రెడ్డి ప్రదర్శించారు.

JC prabhakar
JC prabhakar
author img

By

Published : Jul 5, 2023, 1:37 PM IST

తాడిపత్రి సీఐ ఆనందరావుది ముమ్మాటికీ రాజకీయ హత్యే: జేసీ ప్రభాకర్ రెడ్డి

Tadipatri Town CI Ananda Rao Suicide Updates: అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావుది మూమ్మటికీ రాజకీయ హత్యేనని, దానికి కారణం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒత్తిడేనని.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో జేసీ ప్రభాకర్​రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, ఆత్మహత్య చేసుకున్న సీఐ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. పోలీసు అధికారులు సీఐ ఆనందరావును తీవ్రంగా బాధపెట్టడమే కాకుండా ఒత్తిడికి గురి చేయటం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.

సీఐ హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే.. జేసీ ప్రభాకర్​రెడ్డి మాట్లాడుతూ..'' పోలీసు అధికారుల, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సీఐ ఆనందరావును తీవ్రంగా బాధపెట్టారు. ఆ తర్వాత ఒత్తిడికి గురి చేశారు. అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నేను నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా నన్ను అడ్డగించటానికి తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు పంపించేవారు. పట్టణ సీఐగా ఉన్న ఆనందరావును మిగతా మండలాల్లో విధులకు పంపటం, నాకు వ్యతిరేకంగా కేసులు పెట్టాలని ఒత్తిడి చేయటం వంటి ఒత్తిళ్లు తట్టుకోలేక, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేక సీఐ ఆత్మహత్య చేసుకున్నారు. వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలకు పాల్పడుతూ, సీఐ ఆనందరావుపై ఒత్తిడి చేశారు. సీఐ హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే. అందుకు కారణం ఎమ్మెల్యే పెద్దారెడ్డే.'' అని ఆయ అన్నారు.

Tadipatri CI Suicide: తాడిపత్రి సీఐ బలవన్మరణం..

తెల్లవారుజామున సీఐ ఇంటికి వెళ్లి ఆనందరావు తమ కుటుంబానికి రాసిన లేఖను ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశాడని జేసీ ఆరోపించారు. పోలీసులు లేకుండా ఇంట్లోకి వెళ్లి అల్మారాలో బట్టలు లాగేయాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఎందుకొచ్చింది..? అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డిని ప్రశ్నించారు. పోలీసులు.. సీఐ ఇంట్లోని అల్మారాలపై, తలుపులపై ఉన్న వేలిముద్రలను తీస్తే, అవన్నీ ఎమ్మెల్యేవేనని జేసీ వ్యాఖ్యానించారు. సీఐ ఆనందరావు రాసిన ఉత్తరాన్ని బయటకు రప్పించాలని.. పోలీసు అసోసియేషన్‌ను ఆయన డిమాండ్ చేశారు. లేఖ బయటకు తీసి, సీఐ మొబైల్ ఫోన్‌లో తొలగించిన ఆడియో రికార్డులను వెలుగులోకి తీసుకొస్తే.. ఎమ్మెల్యే బండారం బయటపడుతుందని జేసీ అన్నారు.

ఆ నెల 3న సీఐ ఆనందరావు ఆత్మహత్య.. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు (52) జులై 3వ తేదీన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత మూడు నెలలుగా పని ఒత్తిడితో సీఐ తీవ్ర ఇబ్బందులు పడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. సీఐ ఆనందరావు విషయానికొస్తే.. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయన కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆనందరావు స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి. సీఐకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.