రాష్ట్రంలో మరో మెడికల్ సూపరిండెంట్‌పై వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థులపై వేధింపులు, అవకతవకలకు పాల్పడిన ఘటనలో అనంతపురం జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్, వైద్య కళాశాల మాజీ హెచ్ఓడీ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోని మరో విభాగం ప్రొఫెసర్‌ను ఘటనపై విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. కమిటీ ఇచ్చిన నివేదిక సరిగా లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రాథమికంగా ఆయనపై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకుంటూ ఈ బదిలీ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి