ETV Bharat / state

నేడు అనంతపురం- దిల్లీ కిసాన్ రైలు ప్రారంభం

author img

By

Published : Sep 9, 2020, 5:55 AM IST

Updated : Sep 9, 2020, 6:18 AM IST

ఉద్యాన పంటలకు ప్రసిద్ధి అయిన అనంతపురం జిల్లాలో...యాపిల్‌ తప్ప అన్ని పండ్లనూ రైతులు పండిస్తారు. అయితే సరైన మార్కెట్‌ లేక ఇన్నాళ్లూ నష్టపోతున్న రైతులకు కిసాన్‌ రైలు ఓ వరంలా దొరికింది. రైతులు పండించిన పండ్లు, కూరగాయలతో అనంతపురం నుంచి దిల్లీకి ఇవాళ బయలుదేరనున్న కిసాన్‌ రైలును.. సీఎం జగన్‌ జూమ్‌ యాప్‌ ద్వారా ప్రారంభించనున్నారు.

Anantapur-Delhi Kisan train starts today

దేశంలో రెండో కిసాన్‌ రైలు అనంతపురం నుంచి దిల్లీకి బయలుదేరేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 20 బోగీలు, 340 టన్నుల సామర్థ్యంతో దేశ రాజధానికి వెళ్లనున్న ఈ రైలులో.. రైతుల కోసమూ ప్రత్యేక బోగీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే తొలి రైలు నాసిక్‌ నుంచి బిహార్‌కు నడుస్తోంది. అనంతపురం జిల్లాలో పండించే అరటి, మామిడి, బత్తాయి, బొప్పాయి వంటి పంటలను దేశ రాజధానికి తరలించే లక్ష్యంతో రెండో రైలును కేంద్రం ప్రకటించింది.

కిసాన్‌ రైలు ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య పరిశీలించారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్‌.. ఏయే ఉత్పత్తులు పంపిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందు కిసాన్ ట్రక్కు ఉండేదని, ప్రస్తుతం అది కిసాన్ రైల్ అయిందని, భవిష్యత్తులో అది కిసాన్ ఉడాన్ కూడా అవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కోసం ఓ రైలు ఏర్పాటు చేయటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్‌ నుంచి స్టేషన్‌కు మళ్లీ దిల్లీలో స్టేషన్‌ నుంచి మార్కెట్‌కు సరుకు తరలించేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టన్ను తరలింపు ఛార్జీని తగ్గిస్తే లాభసాటిగా ఉంటుందని వెల్లడించారు.

మార్కెట్‌ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న రైతులకు లాభం చేకూర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో కిసాన్ రైలు వచ్చిందని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. సాధారణంగా ట్రక్కుల మీద 72 గంటల్లో వెళ్లే సరుకు... ఇప్పుడు 36 గంటల్లోనే చేరుతుందని చెప్పారు. కిసాన్‌ రైలును రైతులంతా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కోరారు. కిసాన్‌ రైలు ద్వారా సరుకు రవాణా లాభసాటిగా ఉంటే దీన్నే వినియోగించుకుంటామని రైతులు చెప్పారు.

ఇదీ చదవండి

ఇది హిందువులపై దాడే...! మహిళలూ నిరసన తెలపండి: పవన్ కల్యాణ్

Last Updated : Sep 9, 2020, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.