ETV Bharat / state

'ఎన్నికల్లో అలజడి సృష్టిస్తే చర్యలు తప్పవు' - అనంతపురం కలెక్టర్ న్యూస్

అనంతపురం జిల్లాలో ఎస్​ఈసీ నిమ్మగడ్డ నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

collector on local elections
పంచాయతీ ఎన్నికలు
author img

By

Published : Jan 30, 2021, 10:37 AM IST

పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా అలజడి సృష్టిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణపై శుక్రవారం అనంతపురంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ సిబ్బందిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో గట్టిగా నిఘా ఉంచాలని సూచించారు. మద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఫిర్యాదులు వస్తే సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

పక్కాగా ఏర్పాట్లు

జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లలో నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని... కదిరి డివిజన్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రెండు స్టేజ్‌లు ఉంటాయన్నారు. స్టేజ్‌-1లో అభ్యర్థి ఎంపిక, నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. స్టేజ్‌-2లో పోలింగ్‌, లెక్కింపు, అభ్యర్థుల ఎన్నిక ఉంటుందని చెప్పారు. స్టేజ్‌-1లో 377 మంది ఆర్వోలు, స్టేజ్‌-2లో 258 మంది ఆర్వోలను నియమించామని చెప్పారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవాలు జరిగిన ప్రాంతాలను అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

సమస్యాత్మక కేంద్రాలపై నిఘా

జిల్లాలో 269 అత్యంత సమస్యాత్మక, 374 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని... వాటిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచుతామన్నారు. జిల్లాలో 12 వేల మందిని బైండోవర్‌ చేశామని, పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోంగార్డుల నుంచి ఎస్పీ వరకు మొత్తం 3,600 మంది సిబ్బంది ఉన్నామని, గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్యం, నగదు, ఇతర ప్రలోభాలకు ఓటర్లను గురిచేయకుండా దృష్టి సారిస్తామన్నారు. ఎవరైనా కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అనంతపురం కలెక్టరేట్‌లో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.