ఖరీఫ్‌లో పంటల సాగుకు అనువుగా వానలు కురవకపోవటంతో... అనంతపురం జిల్లాలో వర్షం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. జూన్ 6 తర్వాత దాదాపు 20 రోజుల పాటు అనంతపురం జిల్లాలో చినుకు జాడే లేకుండా పోయింది. భూమి దుక్కిదున్ని పెట్టుకున్న రైతులంతా ఆకాశం వైపు చూస్తున్నారు. జిల్లాలోని 6 లక్షల 74 వేల హెక్టార్లలో సింహభాగం వేరుశనగ సాగులోకి రానుందని అధికారులు అంచనా వేశారు.
అధికారుల అంచనాకు సరిపడా వానలు పడకపోవటంతో.. జిల్లా వ్యాప్తంగా పంటమార్పిడికి రైతులను ప్రోత్సహించారు. పంట నష్టం పరిహారానికి సంబంధించి గతేడాది నుంచి వాతావరణ బీమా అమల్లోకి రావటంతో... వేరుశెనగతో నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశముందని రైతులు కంది వంటి ప్రత్యామ్నాయాలవైపు మొగ్గుతున్నారు.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు నెలవుతున్నా.. జిల్లావ్యాప్తంగా ఆశించిన మేర విత్తనాల ప్రక్రియ పూర్తవలేదు. అయితే జులైలో వర్ష అంచనాలు బాగున్నాయని... దాదాపుగా అన్ని పొలాల్లో విత్తనాలు వేసేయొచ్చని అధికారులంటున్నారు.
ఇదీ చదవండి:
ఎంపీ రఘురామ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ స్పందన.. నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం