రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. రైతుల ఆందోళనలు 350 రోజులకు చేరుకున్న సందర్భంగా.. అనంతపురం జిల్లా కదిరిలో మెడకు ఉరితాళ్లు కట్టుకొని సమితి సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించి.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనను విరమింప చేయాలని రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:
'బాధలు చెప్పుకుందామని పోతే.. కండువా కప్పి పార్టీలోకి రమ్మన్నారు'