అనంతపురం జిల్లా ఉరవకొండలో వీఆర్వోలు, తహసీల్దార్ల మధ్య వివాదం నెలకొంది. ఇతర శాఖల అధికారుల ముందు తహసీల్దార్ తమను అవమానకరంగా మాట్లాడారని వీఆర్వోలు ఆరోపించారు. తాము సామూహిక సెలవులో వెళ్తున్నట్లు మండలానికి చెందిన 12 మంది వీఆర్వోలు శుక్రవారం సాయంత్రం తెలిపారు.
ఉదయం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ క్రాప్ నమోదు శిక్షణ కార్యక్రమంలో.. ఇతర శాఖల సిబ్బంది ఎదురుగా.. ఎమ్మార్వో అవమానకరంగా మాట్లాడారని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ తాము సామూహిక సెలవులో వెళ్తున్నామన్నారు. తమకు సామూహిక సెలవు మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు రాతపూర్వకంగా తెలియజేశారు.
ఇదీ చదవండి: