పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని.. అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పోస్ట్ కార్డుల ద్వారా నిరసన తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. కోర్టు తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వంలో చలనం రాలేదని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడుతోందన్నారు. పరీక్షలను రద్దు చేయాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తను ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
సెప్టెంబరు వరకు వ్యాక్సిన్ లేదనడం ప్రభుత్వ అసమర్థత: అచ్చెన్న