వేరుశగన విత్తన ప్రాసెసింగ్‌ను పరిశీలిస్తున్న వ్యవసాయం శాఖ కమిషనర్ అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని శ్రీ సత్య సాయి రైతు పరస్పర సహాయ సహకార పరిమిత సమాఖ్యలోని వేరుశెనగ విత్తన ప్రొసెసింగ్‌ను వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు రబీలో 2020నాటికి అవసరమయ్యే నాలుగున్నర లక్షల క్వింటాళ్ల వేరుశెనగను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుంచి ఏపీ సీడ్స్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్‌తో పాటు ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు , సీడ్స్ జేడీఏ కృపాదాస్, అనంతపురం వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు హబీబ్ బాషా తదితురులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి
ఆమంచి... మా మంచి హాస్య నటుడు