అనంతపురం జిల్లా గార్లదిన్నే మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రాన్ని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు. గ్రామ స్వరాజ్యం స్థాపించాలన్న లక్ష్యంతో... ఈ కేంద్రాలను ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిందన్నారు. దీనివల్ల వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అన్నదాతల వద్దకే అందుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: 'అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు'