ETV Bharat / state

స్కూల్​బస్ బోల్తా.. త్రుటిలో తప్పిన ప్రమాదం - safe

సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్న స్కూల్​బస్ అదుపుతప్పి బోల్తా పడింది. అనంతపురం జిల్లా గుంతకల్లులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

బోల్తా పడ్డ పాఠశాల బస్సు... తృటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Jul 4, 2019, 10:26 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని బళ్లారి -అంకోలా జాతీయ రహదారిపై పాఠశాల బస్సు బోల్తాపడింది. పెను ప్రమాదం తృటిలో తప్పి ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. గుంతకల్లులోని ఓ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బస్సు సామర్థ్యం కంటే ఎక్కువ మందితో వెళుతుండగా... అదుపు తప్పింది. రహదారి కిందకు వేగంగా దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్​ తప్పించుకొనే ప్రయత్నం చేయగా... స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బోల్తా పడ్డ పాఠశాల బస్సు... తృటిలో తప్పిన ప్రమాదం

ఇదీ చదవండి.. 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం

Intro:Ap_cdp_42_04_amarnath_yatralo_mahila_mruthi_av_ap10041
Place: prodduturu
Reporter: madhusudhan

కైలాసగిరుల్లో కొలువున్న అమరనాథుని దర్శించుకునేందుకు వెళ్లిన ఓ భక్తురాలికి అదే అంతిమ యాత్రగా మారింది. కడపజిల్లా ప్రొద్దుటూరు బాలాజీనగర్‌-1 కు చెందిన పెండ్లిమరి భాగ్యమ్మ(52) జూన్‌ 26న తన భర్త శంకరయ్యతోపాటు అమరనాథ్‌ యాత్రకు బయల్దేరి వెళ్లారు. కడప నుంచి అజ్రత్‌ ఇజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయల్దేరిన వారు మరొసటి రోజు దిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి జమ్ముకశ్మీర్‌లోని బల్తాల్‌ బేస్‌ క్యాంప్‌కు వెళ్లారు. అనంతరం అమరనాథ్‌కు వెళ్లాల్సి వుంది. ఈ నేపథ్యంలో నిన్న (బుధవారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భాగ్యమ్మకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. శవపంచనామా కోసం అక్కడ సోనామార్గ్‌ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం ఇవాళ జమ్ముకశ్మీర్‌ నుంచి ప్రత్యేక ఎయిర్‌బస్‌ ద్వారా రాత్రికి హైదరాబాద్‌ చేరుకోనుంది. విషయం తెలిసిన వెంటనే ప్రొద్దుటూరు తహశీల్దార్ మృతిరాలి వివరాలను సేకరించేందుకు వీఆర్వో మస్తాన్‌వలీని ఆదేశించారు. ఘటన గురించి కలెక్టర్‌కు నివేదించనున్నారు. రేపు ఉదయం ప్రొద్దుటూరులో అంత్యక్రియలు జరపనున్నట్లు బంధువుల తెలిపారు. మృతురాలికి కుమారుడు , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త శంకరయ్య జమ్మలుమడుగు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.Body:AConclusion:A

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.