తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన సంగీత, ప్రవీణ్, కిరణ్... ఓ ప్రైవేట్ కారులో మధురై-దిండిగల్ జాతీయ రహదారి-44పై మధురై వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి... మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కేరళ రాష్ట్రానికి చెందిన ముగ్గురు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను తమిళనాడులోని రాజాజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండీ... అండగా నిలవాల్సిన ప్రభుత్వమే... ఇలా చేస్తే ఎలా...?