అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అనిశా అధికారులు.. నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ఏజెంట్లు, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సులకు నగదు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులతో తనిఖీలు చేపట్టారు.
అనుమానంగా వెళ్తున్న వాహనాన్ని ఆపి పరిశీలించగా.. అందులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఉన్నాడని.. అతని వద్ద నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఐదుగురు ఏజెంట్ల వద్ద మరికొంత సొమ్మును పట్టుకున్నట్టు డీఎస్పీ కులశేఖర్ వెల్లడించారు.
ఇదీ చదవండి:
కొవిడ్‌ను తరిమికొట్టాలంటే.. వ్యాక్సినేషన్ తప్ప మరోమార్గం లేదు: సీఎం