కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోతే అంత్యక్రియలు సైతం నిర్వహించలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో మానవత్వమే తమ అభిమతమని చాటుతున్నారు గుంతకల్లు పట్టణానికి చెందిన 'ఆ నలుగురు' సేవ సమితి సభ్యులు. కరోనా సోకి మరణించిన వారికి.. అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాని పక్షంలో వారే చివరి తంతు పూర్తి చేస్తున్నారు. బాధితులు కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు.
అన్నీ తామై..
అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో ఒక్క రోజులోనే ఐదు నుంచి ఆరు మంది వరకు కరోనాతో మరణించారు. బంధువులు సైతం వారికి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాకపోగా.. విషయం తెలుసుకున్న ఆ నలుగురు ప్రతినిధులు.. బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. మృతి చెందిన వారి సంప్రదాయం ప్రకారమే అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తూ.. బాధితులకు ఊరట కల్పించారు.
ఇదీ చదవండి:
మమ్మల్ని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించండి: డీలర్ల సంఘం