అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జగదీశ్వరి ఆలయం పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి గురువారం సాయంత్రం సమయంలో నిప్పులు ఎగిసి పడ్డాయి. ఈ ఘటనతో భయాందోళనలకు గురై ట్రాన్స్కో సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారు స్పందించ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి 1 గంట సమయంలో ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పులు ఎగిసిపడి పక్కనే ఉన్న ఐచర్ వాహనం కాలిపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన వాహనం దగ్ధమైందని, పరిహారం చెల్లించాలని బాధితుడు, స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి