నంద్యాలలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ముస్లిం సోదరులు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న, నాయకులు, కార్యకర్తలు నినాదాలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు.
ఇస్లాం మతంలో ఆత్మహత్యను పాపంగా పరిగణిస్తారు. అవన్ని తెలిసిన వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించే ముందు సెల్ఫీ వీడియోతో వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అతను ఎంత క్షోభ అనుభవించాడు అనేది అర్థం అవుతోంది. సలాం ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి -మైనార్టీ నాయకులు
ఏ తప్పు చేయని సలాంను పోలీసులు వేధించడంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే. కారకులైన పోలీసులను కఠినంగా శిక్షించక తూతుమంత్రంగా అరెస్టు చేసి, తిరిగి వారిని వదిలేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది -ఈరన్న, మాజీ ఎమ్మెల్యే
ఇదీ చదవండీ...ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంతిమయాత్రలో భారీగా పాల్గొన్న జనం