అనంతపురం జిల్లా పెద్దపప్పురు మండలం జూటూరు సమీపంలోని పెన్నానదిని దాటుతూ.. కూలీలతో వెళుతున్న ఓ ఐచర్ వాహనం అదుపుతప్పి నదిలోకి ఒరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని స్థానికులు, జేసీబీ సాయంతో వాహనంతో పాటు కూలీలను బయటకు తీసి రక్షించారు.
పెద్దపప్పురు మండలం పెండెకళ్లు గ్రామానికి చెందిన 30 మంది వ్యవసాయ కూలీలు యల్లనూరు మండలంలో పనులు నిమిత్తం ఐచర్ వాహనంలో బయల్దేరారు. జూటూరు గ్రామ సమీపంలోని పెన్నానది వద్దకు రాగానే నీటి ప్రవాహానికి ఐచర్ వాహనం అదుపుతప్పి ముందు భాగం నదిలోకి ఒరిగిపోయింది. నదిలోకి పడిపోయేలా ఉన్న వాహనాన్ని చూసి గట్టిగా కేకలు వేయగా గమనించిన స్థానికులు వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేశారు.
ఇదీ చదవండి:
CJI Ramana: ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు..పాలకులు వారి సమస్యలను పరిష్కరించాలి: సీజేఐ