అనంతపురం జిల్లా ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల అత్యవసర సమావేశం రసాభాసగా సాగింది. 20 మంది వార్డు సభ్యులున్న మేజర్ పంచాయతీలో కొందరిని పక్కన పెట్టి ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సభ్యులందరికీ అసలు ఆర్డర్ కాపీలు ఇవ్వకపోవడం...సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి అంశాలపై సభ్యులు మండిపడ్డారు. పట్టణంలో పరిశుభ్రత పనులు, చెత్తను సేకరించడం, దోమలు నివారణ చర్యలు, ఆరోగ్య పరిరక్షణ పనులు సరిగా చేపట్టడం లేదని ఆరోపించారు. కారణాలు చెప్పకుండా విధుల నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం ఏంటని కొందరు వార్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో నేలపై కూర్చుని వార్డు సభ్యులు నిరసన తెలిపారు.
ఇదీ చదవండి : మన ఎమ్మెల్యే సింహం లాంటోడు: సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు