ETV Bharat / state

అప్పుల బాధ తట్టుకోలేక వెళ్లిపోయాడు..కానీ 26 ఏళ్ల తర్వాత - అనంతపురం జిల్లా తాజా వార్తలు

CAME: అతను అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్లిపోయాడు... ఏడాది.. రెండేళ్లు కాదు.. ఏకంగా 26 సంవత్సరాలు అడ్రస్​ లేకుండాపోయాడు.. కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో వెతికినా.. ఆచూకీ లభించలేదు. కానీ తాజాగా లేడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు... ఆ ఇంటి పెద్ద తిరిగి రావడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

a man returned to home after 26 years
26 ఏళ్ల క్రితం అదృశ్యమై తిరిగి ఇంటికి చేరుకున్న వ్యక్తి
author img

By

Published : May 2, 2022, 12:35 PM IST

26 ఏళ్ల క్రితం అదృశ్యమై తిరిగి ఇంటికి చేరుకున్న వ్యక్తి

Return back to Home after 26 years: అప్పుల బాధతో 26 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి.. తిరిగి ఇంటికి చేరుకున్న సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు అరవ నాగరాజు... అప్పుల బాధతో 26ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు.. ధర్మవరం, హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తూ జీవనం సాగించాడు. మూడేళ్లుగా హైదరాబాద్ చింతల్ బస్తీలో వాచ్​మెన్​గా పని చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం పాలవడంతో తన వివరాలను అక్కడి వారికి చెప్పడంతో.. వారు నాగరాజుని స్వగృహానికి చేర్చారు. లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో.. కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

ఇదీ చదవండి: Kidnap: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.