అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి చేయి విరిగింది. శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా... ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చిన అనంతరం మంగళవారం శస్త్రచికిత్స చేశారు. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేయగా... ఎంతసేపటికి స్పృహలోకి రాలేదు. విషయం తెలియడంతో బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. మాసివ్ ఎమ్ఐ వల్ల చంద్రశేఖర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ కరుణాకర్ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి... ఆందోళనకు దిగిన బంధువులు - అనంతపురంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. శస్త్రచికిత్స చేసిన తర్వాత మృతి చెందటంతో బంధువులు ఆందోళనకు దిగారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి చేయి విరిగింది. శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా... ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చిన అనంతరం మంగళవారం శస్త్రచికిత్స చేశారు. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేయగా... ఎంతసేపటికి స్పృహలోకి రాలేదు. విషయం తెలియడంతో బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. మాసివ్ ఎమ్ఐ వల్ల చంద్రశేఖర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ కరుణాకర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వ్యక్తి దారుణ హత్య