అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం గురుకుల పాఠశాల వద్ద ఓ వ్యక్తి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ముదిగుబ్బ మండలం కొండగట్టుపల్లికి చెందిన సుబ్బారెడ్డి గా గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
మృతుడు వ్యవసాయంతో పాటు జీవిత భీమా ఏజెంట్గా కూడా పనిచేస్తున్నట్లు బంధువులు తెలిపారు. కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక ... బలవన్మరణానికి పాల్పడిన ఉంటాడని బంధువులు తెలిపారు.
ఇదీ చదవండి: జీజీహెచ్లో నర్సుల ధర్నా