అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం సోమలాపురం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఫక్రుద్దీన్.. సోమలాపురం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గార్మెంట్స్ కార్మికుడిగా సౌత్ వెస్ట్రన్ రైల్వే పోలీసులు గుర్తించారు. భార్యభర్తల మధ్య వివాదాల నేపథ్యంలో ఫక్రుద్దీన్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపారు. హుబ్లీ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి:విరసం నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు