అనంతపురం జిల్లా అమరాపురం మండలం కెంకెర గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఇల్లు పూర్తిగా దగ్ధమవ్వగా.. ద్విచక్రవాహనం కాలి బూడిదయ్యింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని బాధితురాలు లక్ష్మక్క వాపోయింది. ప్రమాద సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ.. తన భర్త ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలిపింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన షర్మిళ