అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నూరుకు చెందిన కలికి సూరి భవన నిర్మాణ కార్మికుడు… అంజి అనే వ్యక్తి చేనేత కార్మికుడు. సూరి పట్టణంలోని సంజయ్ నగర్ వద్ద భవన నిర్మాణ పనులు చేస్తుండగా… అంజి అక్కడికి వచ్చి కత్తితో దాడి చేశాడు. గాయపడిన సూరిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి..ఆరా తీశారు. అంజి భార్యతో సూరి చనువుగా ఉంటున్నాడని అనుమానం పెంచుకొని... దాడి చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సహోద్యోగుల ఆర్థిక సాయం