అనంతపురం జిల్లా కదిరిలో వరుసకు బావ అయిన వ్యక్తిపై బావమరిది కత్తితో దాడి చేశాడు. కదిరి పట్టణంలో విద్యుత్ పరికరాల దుకాణం నిర్వహిస్తున్న హాబీద్ వలీపై సమీప బంధువు బాబ్జాన్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. హాబీబ్ వలీకి అతని బావమరిది బాబ్జాన్కు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా రాయలసీమ కూడలిలోని హాబీద్ వలీ దుకాణం వద్దకు వచ్చిన బాబ్జాన్ మరోసారి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ముందస్తు ప్రణాళికతో తన వెంట తెచ్చుకున్న కత్తితో హాబీబ్ వలీపై, బాబ్జాన్ విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హాబీద్ వలీని అనంతపురం తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.
ఇదీ చదవండి: