అనంతపురం జిల్లా కొత్త చెరువులోని ఇసుకవంక వీధిలో స్నానపు గది గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. చంద్ర, సుజాతల రెండవ కుమారుడు యజుర్వేద (5) ఆదివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ స్నానపు గది గోడ కూలింది. గోడ శిథిలాలు బాలుడి మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రమైన రక్తస్రావంతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడంతో వీధిలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: