అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కరిగానిపల్లి గ్రామంలో ఓ గొర్రెల కాపరిపై ఎలుగు దాడి చేసింది. గ్రామ శివార్లలో గొర్రెలు.. మేపటానికి వెళ్లగా పొదలో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. అనంతపురానికి తీసుకెళ్లారు. అటవీశాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండీ.. Love Cheating: ప్రేమ పేరుతో మోసం.. ఆత్మహత్య పేరిట యువతిని చంపేందుకు యత్నం