ఆడపిల్ల అంటే ఇంకా భారంగానే భావిస్తున్నారు కొందరు. ఆడపిల్ల అని తెలియగానే పురిటిలోనే చంపేవారు కొందరైతే... పుట్టగానే చెత్తకుప్పలో పడేసేవారు మరికొందరు. ఇలాంటి అమానవీయ ఘటనే అనంతపురం జిల్లా సాయినగర్లోనూ జరిగింది. కళ్లైనా తెరవని ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని సాయినగర్ కాలనీ చెత్తకుప్పలో పడేశారు. ఆ పసికందు ఏడుపు విని స్థానికులు అక్కున చేర్చుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారిని ఎవరు అక్కడ వదిలి వెళ్లారనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: