అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సావిత్రిబాయి పూలె జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్.వెన్నెల సాయిని ఒక్కరోజు ప్రధానోపాధ్యాయురాలుగా నియమించారు. అధికారులుగా బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకొని మరింత పట్టుదలతో చదివి ఉన్నతస్థానాలకు చేరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తనకు ఈ అవకాశం వచ్చేలా చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాన్, ఇతర గురువులకు వెన్నెలసాయి కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చదవండి :