సాధారణంగా ఒక కాన్పులో ఒక్కరు లేదా ఇద్దరు పుడుతుంటారు. కానీ..అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఆటోనగర్‌కు చెందిన భవ్య భాను.. పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు.. సాధారణ కాన్పు చేశారు.
భవ్య భాను.. ఇద్దరు ఆడపిల్లలు.. ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉండగా.. మరో చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ శిశువును హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చికిత్స కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:
Aadhar: ఆధార్‌లో మార్పులకు తప్పని తిప్పలు.. గంటల తరబడి ఎదురుచూపులు