అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి జాతరలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్లకొకసారి జరిగే మరిడి మహాలక్ష్మి జాతర దృష్ట్యా 4 కూడళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రంతా అమ్మవారి ఊరేగింపు, జాగరణ ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే పోలీసులు మాత్రం.. అనుమతించిన సమయం దాటిపోయిందని సాంస్కృతిక కార్యక్రమాల వేదికల వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
విద్యుత్ నిలిపివేయడంపై పోలీసులతో తెదేపా నేత అయ్యన్న వాగ్వాదానికి దిగారు. పరిసర గ్రామాల్లో అర్ధరాత్రి 2 వరకు అనుమతించారన్న అయ్యన్న.. తమపై మాత్రం ఆంక్షలు ఏమిటని నిలదీశారు. ఇవాళ కూడా పండుగ కొనసాగుతుందన్నారు. పోలీసులు తీరును ప్రశ్నించిన తనను.. తెల్లవారుజాములోగా అరెస్టు చేయవచ్చన్నారు. తనను అరెస్టు చేసినా పండుగ ఆపవద్దని అయన్నపాత్రుడు తెలిపారు.
ఇదీ చదవండి: vontimitta : వైభవంగా రామయ్య కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం