ETV Bharat / state

పెళ్లి ఇష్టం లేకనే కాబోయే భర్తపై కత్తితో యువతి దాడి చేసింది: డీఎస్పీ - Police revealed the details young woman attacking her fiance case in Anakapalle

oman attacking her fiance
కాబోయే భర్తపై కత్తితో యువతి దాడి
author img

By

Published : Apr 19, 2022, 5:49 PM IST

Updated : Apr 19, 2022, 7:11 PM IST

17:43 April 19

కాబోయే భర్తపై యువతి దాడి కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమళ్లపూడి వద్ద.. ఓ యువతి కాబోయే భర్తపై హత్యాయత్నం చేసిన ఘటన వివరాలను డీఎస్పీ సునీల్​ వెల్లడించారు. పెళ్లి ఇష్టం లేకనే ఆ యువతి వరుడిపై దాడి చేసిందని అన్నారు. మాడుగుల మండలం ఘాట్‌రోడ్డుకు చెందిన అద్దేపల్లి రామానాయుడుకు, రావికమతంకు చెందిన వియ్యపు పుష్పకు... వివాహ నిశ్చితార్థం జరిగిందని, వచ్చే నెల 20న పెళ్లి జరగాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

తల్లిదండ్రుల అనుమతితోనే అమ్మాయి, అబ్బాయి కలిసి స్కూటీపై బయటకి వెళ్లారని, వడ్డాది వద్ద స్కూటీ ఆపి గిఫ్ట్ కొంటానని యువతి షాప్‌లోకి వెళ్లిందని తెలిపారు. ఏం కొన్నావని అడిగితే అబ్బాయికి చెప్పలేదని, అక్కడి నుంచి యువకుడిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రమం వద్దకు తీసుకెళ్లిందని అన్నారు.. బహుమతి ఇస్తాను, కళ్లు మూసుకో అని అబ్బాయికి చెప్పి.. అబ్బాయి కళ్లు మూసుకుంటే సరిగ్గా మూసుకోలేదని కళ్లకు చున్నీ కట్టిందన్నారు. ఆ తర్వాత చాకుతో అబ్బాయి గొంతు కోసిందని వెల్లడించారు.

పెళ్లి ఇష్టం లేకనే గొంతు కోసినట్లు ఆ యువతి చెప్పిందని అన్నారు. ఆ యువకుడు ఆ చున్నీని అలాగే మెడకు చుట్టుకుని ఆస్పత్రికి బయలుదేరాడని, ఆ యువతి ఆత్మహత్య చేసుకుంటుందేమోననే అనుమానంతో ఇద్దరు కలిసే బయలుదేరారని డీఎస్పీ తెలిపారు. మధ్యలో స్థానికులు వారిని గమనించి ఆస్పత్రికి తరలించారని అన్నారు. ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆ యువతి ఈ ఘాతుకానికి పాల్పడిందని, దైవ చింతనలో జీవితం గడపాలని ఆ యువతి భావిస్తోందని డీఎస్పీ తెలిపారు. పెళ్లి చేసుకోనంటే పెద్దలు ఒప్పుకోరేమోనని దాడి చేసినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ పేర్కొన్నారు. యువతిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని డీఎస్పీ సునీల్‌ మీడియాకు తెలిపారు.

ఇదీ చదవండి: కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది.. కత్తితో గొంతు కోసి పరారైంది!

Last Updated : Apr 19, 2022, 7:11 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.